Friday, November 13, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి!

ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి!

📰 Generate e-Paper Clip

ఎర్రగాండ్లపల్లిలో కరపత్రాల ఆవిష్కరణ,పంపిణీ…
ప్రజాసంక్షేమం న్యూస్ మర్రిగూడ
:అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం (12-11-2026) మర్రిగూడ మండలం ఎర్రగాండ్లపల్లి గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించి, ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల గడ్డ నల్లగొండ నడిబొడ్డున ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగాన్ని కాపాడటం, రైతాంగ ఐక్యతను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ జాతీయ మహాసభలను రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నవంబర్ 14న నిర్వహించే కార్యక్రమంలో వ్యవసాయ యంత్ర పరికరాలు, విత్తనాల పరిరక్షణపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి కేవలం రైతుల హక్కులకు సంబంధించిన అంశాలే కాకుండా భవిష్యత్ తరాల ఆహార భద్రతకు కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. మర్రిగూడ మండలం నుంచి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.అఖిల భారత కిసాన్ సభ 90 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నల్లగొండలో నిర్వహించే జాతీయ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికుల హక్కులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, పని గంటల విధానాలు కూడా కార్మికులకు ఇబ్బందులు కలిగించేలా ఉన్నాయని ఏర్పుల యాదయ్య విమర్శించారు.ఈ కార్యక్రమంలో కే. రజిత, లక్ష్మమ్మ, పాలకూర యాదయ్య, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.