Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలురహదారుల పనులు, ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రహదారుల పనులు, ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

📰 Generate e-Paper Clip

ఈ ఏడాదిలోనే ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
ఆర్‌ అండ్‌ బీ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి ఆదేశాలు

ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న రహదారుల నిర్మాణ పనులు, హామ్ రోడ్లు, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు, నూతన హైకోర్టు భవన నిర్మాణాలపై సమీక్షించారు. ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఈ ఏడాదిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సదస్సు ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సును తెలంగాణ అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహించాలని సూచించారు.ప్రత్యేక తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయడంతో పాటు, డిసెంబర్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఈ సదస్సును వేదికగా మలచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో పనుల వేగం, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.