కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి మేమున్నామంటూ యువశక్తి యువజన సంఘం సభ్యులు అండగా నిలిచారు.
చిట్యాల | ప్రజా సంక్షేమం న్యూస్:
ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా చేయూతనివ్వడమే కాదు.. కష్టకాలంలో వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన మీసాల కిషన్ (52) ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న యువశక్తి యువజన సంఘం సభ్యులు వెంటనే స్పందించి, కిషన్ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధలో పాలుపంచుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన ఆ కుటుంబానికి తమ వంతు అండగా నిలవాలనే గొప్ప మనసుతో రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. మున్సిపాలిటీలో నిబద్ధతతో పనిచేస్తూ అందరికీ సుపరిచితుడైన కిషన్ ఆకస్మిక మరణం తీరని లోటని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
మనిషి ఉన్నప్పుడు పలకరించడం ఒక ఆప్యాయత.. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం నిజమైన మానవత్వం. సేవకు ఆడంబరాలు అవసరం లేదని, తోటి మనిషి కన్నీటిని తుడిచే మంచి మనసుంటే చాలని యువశక్తి యువజన సంఘం తమ సేవా కార్యక్రమం ద్వారా చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, స్థానిక కౌన్సిలర్ మరియు నాయకులు పాల్గొన్నారు.
కన్నీటి కుటుంబానికి యువశక్తి భరోసా.. ఆపదలో నేనున్నామంటూ రూ.10 వేల ఆర్థిక సాయం!
RELATED ARTICLES

