Friday, November 13, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలునవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

📰 Generate e-Paper Clip

అర్హులైన 18 నుంచి 59 ఏళ్ల వారికి బీమా సదుపాయం
ప్రజాసంక్షేమం న్యూస్ యాదాద్రి భువనగిరి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు.ఈ పథకం అమలుపై శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో జన్మించి, 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో బీమా వ్యక్తిగా నమోదు చేసుకునేందుకు అర్హులని కలెక్టర్ తెలిపారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రత్యేక నమోదు కేంద్రాలు, క్యాంపులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ఫారాలు, ప్రొఫార్మాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.