కొతులారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS) హెచ్‌ఎం పోకబత్తి వివేకానంద్ అవినీతి, ఫోర్జరీ సంతకాలు, అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించి ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని కార్పొరేట్ విద్యా నియంత్రణ JAC రాష్ట్ర కార్యదర్శి బొలుగూరి ముకేష్ తెలిపారు.
ఈ విషయమై జులై 23న కార్పొరేట్ విద్యా నియంత్రణ JAC, చరణ్య శ్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “చలో DEO కార్యాలయం” పేరుతో మహా నిరసన ధర్నా నిర్వహించినప్పటికీ స్పందన లేకపోవడంతో సోమవారం DEOకు ముందస్తు నిరాహార దీక్ష నోటీసు అందజేశారు.
RTI ద్వారా సేకరించిన ఆధారాలపై హెచ్‌ఎంపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే జులై 31, 2026 (శుక్రవారం)న నల్గొండ కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం, గోపి, వంశీ, రవికుమార్, దినేష్, తరుణ్, యాదగిరి, జానీ తదితరులు

అవినీతి హెచ్‌ఎంపై చర్యలు తీసుకోకపోతే జులై 31న నిరాహార దీక్ష: జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బొలుగూరి ముకేష్
RELATED ARTICLES

