ఘనంగా జరిగాయి
పట్టణంలోని శివాజీ నగర్, ముషంపల్లి రోడ్ లోని సాయిబాబా దేవాలయాలలో గురుపౌర్ణిమ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు
నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, నల్గొండ మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తదితరులు దేవాలయంలో సాయిబాబాను దర్శించుకున్నారు
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యామ కవితా దయాకర్, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, బచ్చలకూరి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు

