Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర... 7437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల!

తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర… 7437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల!

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు పోలీస్ కానిస్టేబుళ్ల ఖాళీలను, అలాగే అగ్నిప్రమాద విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ శాఖ, జైళ్లు మరియు దిద్దుబాటు సేవల శాఖ మరియు ప్రత్యేక రక్షణ దళంలోని ఇతర సమానమైన పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్‌, ఏఆర్‌, స్పెషల్‌ పోలీసు, జైళ్లు, ఫైర్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ (సివిల్‌) 3,697, కానిస్టేబుల్‌ (ఏఆర్‌) 1,052 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఎస్సై 44, కానిస్టేబుల్‌ 1,380 పోస్టులున్నాయి. ఫైర్‌ విభాగంలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ 39, ఫైర్‌ ఫైటర్‌ 751 పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో 223 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది.

ఏయే విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు

ఎస్ఐ(సివిల్) – 148
ఎస్ఐ(ఏఆర్)-14
టీజీఎస్‌పీ ఎస్‌ఐ – 12
ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ ఎస్‌ఐ -3
ఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23 పోస్టులు

కానిస్టేబుల్ : ఎస్ఐ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కాడా పోలీసు నియమాక మండలి నోటిపికేషన్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కానిస్టేబుల్‌ (సివిల్‌) 3,697
కానిస్టేబుల్ ఏఆర్‌ 1052
పీటీవో కానిస్టేబుల్ 20
కానిస్టేబుల్ మెకానిక్‌ 7
స్పెషల్ పోలీస్‌ (ఎస్‌ఐ) 44
కానిస్టేబుల్ 1,038
ఫైర్ విభాగంలో :

స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39,
ఫైర్ ఫైటర్ 751 పోస్టులు
డిప్యూటీ జైలర్ (మెన్‌) 14
డిప్యూటీ జైలర్ (మహిళ) ఒక పోస్టు
వార్డర్ (మేల్) 196
వార్డర్ (మహిళ) 12 పోస్టులు భర్తీ

త్వరలో దరఖాస్తు తేదీలు ప్రకటిస్తామన్న పోలీసు నియామక మండలి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.