Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు, సానిటరీ మెటీరియల్ పంపిణీ!

ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు, సానిటరీ మెటీరియల్ పంపిణీ!

📰 Generate e-Paper Clip

* పారిశుధ్య కార్మికుల రక్షణ, పరిశుభ్రతే ధ్యేయం: సర్పంచ్ గర్దాసు విక్రమ్
* గ్రామాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని పిలుపు
* పాల్గొన్న ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు

ప్రజా సంక్షేమం న్యూస్
రామన్నపేట / ఇంద్రపాలనగరం (ప్రజా సంక్షేమం): ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు మరియు అవసరమైన సానిటరీ మెటీరియల్‌ను గ్రామ సర్పంచ్ శ్రీ గర్దాసు విక్రమ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామంలోని ప్రజలకు నిరంతరం పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో వారి వ్యక్తిగత భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నూతన దుస్తులతో పాటు గ్లౌజులు, మాస్కులు తదితర సానిటరీ పరికరాలను అందజేసినట్లు తెలిపారు.
గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఇంద్రపాలనగరాన్ని స్వచ్ఛ, ఆరోగ్యవంతమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సిబ్బందితో పాటు గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి వీసం నరేందర్, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, రాధారపు మహేశ్, వరికుప్పల స్వామి, నాగలక్ష్మి రాజు, కప్పల మంగమ్మ రాజు, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

📲 తాజా వార్తల కోసం వాట్సాప్ గ్రూప్‌లో చేరండి: https://chat.whatsapp.com/BwFy3XDxdrO6uJ7tQ3nS3l?s=cl&p=a&mlu=4

‘ప్రజా సంక్షేమం’ న్యూస్ రిపోర్ట్: దోమలపల్లి గోపి (ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి) | 9248307393

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.