
🔹 ముగ్గురు సభ్యుల అంతర్జిల్లా జేబుదొంగల ముఠాను అరెస్ట్ చేసిన నల్లగొండ II టౌన్ పోలీసులు.
🔹 నిందితుల నుంచి 2 సెల్‌ఫోన్లు, ఒక ఆటోరిక్షా, ₹3,000 నగదు స్వాధీనం.
🔹 ఆగస్టు 12న నల్లగొండ బస్‌స్టాండ్‌లో ముగ్గురు మహిళల నుంచి 2 సెల్‌ఫోన్లు, ₹3,800 నగదు చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.
🔹 ఆగస్టు 13న మరోసారి చోరీకి యత్నిస్తుండగా ముఠాను పట్టుకున్న పోలీసులు.
🔹 సీఐ K. ఆది రెడ్డి నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించారు.
🔹 ఈ ముఠాపై గతంలో పటాన్‌చెరువు, జీడిమెట్ల, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 16 కేసులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు.
🔹 గతంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లి, బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
🔹 డీఎస్పీ K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించారు.
🔹 కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది D. సైదా బాబు, G. మానస, ఉమారాణి, విజయకుమారి, రాధిక, బాలకోటి, షకీల్లను జిల్లా ఎస్పీ అభినందించారు.

