Sunday, August 23, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనెక్లెస్ రోడ్‌లో పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరన!

నెక్లెస్ రోడ్‌లో పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరన!

📰 Generate e-Paper Clip


* మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలకు ఘన నివాళులు
* హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా వైభవంగా ఆవిష్కరణ కార్యక్రమం
* పెద్ద సంఖ్యలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
హైదరాబాద్ (ప్రజా సంక్షేమం):

సామాజిక సంస్కర్తలు, భారత దేశంలో అణగారిన వర్గాల విద్యా ప్రదాతలు అయిన స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.నెక్లెస్ రోడ్‌లోని హెచ్ఎండీఏ (HMDA) గ్రౌండ్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూలే దంపతుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి ఆ మహనీయులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో అసమానతలు తొలగించి, మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన పూలే దంపతుల ఆశయాలు నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని పూలే దంపతులకు నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.