Sunday, August 23, 2026
prajasamkshemam news
HomeUncategorizedప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్‌.. కేంద్రం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్‌.. కేంద్రం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ | 1: అధిక మోతాదులో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉన్న ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ముందు భాగంలో స్పష్టమైన Front-of-Pack Warning Labels ఏర్పాటు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.జస్టిస్ J.B. పర్దీవాలా, జస్టిస్ K. వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. ప్యాకేజ్డ్ ఆహారాల్లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల వల్ల కలిగే పోషక ప్రమాదాలపై వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలపై FSSAI తీసుకున్న చర్యల తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోకపోతే కోర్టే తదుపరి ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

కేంద్రానికి రెండు వారాల గడువు

Front-of-Pack Warning Labels అంశంపై కేంద్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని రెండు వారాల్లో సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.

ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

వినియోగదారులకు కీలక సమాచారం

ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల గురించి ప్యాకెట్ ముందుభాగంలోనే స్పష్టమైన హెచ్చరికలు ఉంటే.. ఆహారాన్ని కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు మరింత అవగాహనతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

పిల్లలు, యువత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్యాకేజ్డ్ ఫుడ్‌పై స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.