Sunday, August 23, 2026
prajasamkshemam news
HomeUncategorizedలాస్ట్ మైల్ కనెక్టివిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహా ధర్నా

లాస్ట్ మైల్ కనెక్టివిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహా ధర్నా

📰 Generate e-Paper Clip

ఆటో డ్రైవర్లకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ పోరుబాట

హైదరాబాద్: లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ (టీఆర్‌టీయూ) ఆందోళనకు సిద్ధమైంది.

ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు టీఆర్‌టీయూ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ట్రేడ్ యూనియన్ నాయకులు విడుదల చేశారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో తీసుకున్న నిర్ణయం ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్లపై ఈ నిర్ణయం మరింత భారం మోపుతుందని వారు పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఆర్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారి ఉపాధికి భరోసా కల్పించాలని కోరారు.

ఈ నెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగే మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, కార్మికులు హాజరై విజయవంతం చేయాలని టీఆర్‌టీయూ నాయకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.