సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ,రిజిస్ట్రేషన్, సర్వే,గృహ నిర్మాణ అంశాలపై అధికారులతో సమీక్ష!
ప్రజాసంక్షేమం న్యూస్:
సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.హుజుర్ నగర్ మున్సిపాలిటీలో రూ. 1.4 కోట్లతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి మరియు సూర్యాపేట మున్సిపాలిటీలో రూ. 2.1 కోట్లతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.

అనంతరం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత చేపట్టిన రీ-సర్వేకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని, డిసెంబర్‌లో రెండో విడత రీ-సర్వే చేపట్టేందుకు ఇప్పటి నుంచే అధికారులు సిద్ధం కావాలని సూచించడం జరిగింది.ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో ఉన్న ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది.ముఖ్యంగా 15 రోజుల్లో ఎల్-3 సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేయడం జరిగింది.మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను దసరాలోపు పూర్తి చేయాలని, గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వివిధ దశల్లో నిలిచిపోయిన నిర్మాణాలను గుర్తించి 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది

