
ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన నల్గొండ కలెక్టర్
వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు వాడొద్దు: కలెక్టర్ ఆదేశం
ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 15 న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్య అతిథి సందేశానికై ఈనెల 10లోగా అన్ని శాఖలు నివేదికలను పంపించాలన్నారు. ఈ నెల 11 లోగా ఆయా శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసా పత్రాలకు పేర్లను పంపించాలని ,స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా శాఖలు వారి ప్రగతిని తెలిపేలా ఎప్పటిలాగే శకటాలను ఏర్పాటు చేయాలని , ఆ రోజున స్వతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు, సాయంత్రం ఎస్ ఎల్ బి సి లో నూతనంగా నిర్మించిన పెట్రోల్ పంప్ ప్రారంభం, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రధాన శాఖలు శకటాలను ఏర్పాటు చేయాలని, వేడుకలలో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, వేడుకలకు హాజరయ్యే వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ ను పూర్తిగా పాటించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనిడీఈఓ ను ఆదేశించారు. జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించే ప్రతి ఒక్కరూ జాతీయ పతాక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించవద్దని, డెకరేషన్ కు కూడా ప్లాస్టిక్ వాడ వద్దని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో వివిధ శాఖలలో పెండింగ్ లో ఉన్న కంటెంట్ కేసులపై కలెక్టర్ సమీక్షించారు.వర్షాలు సమృద్ధిగా కురవాలని ,ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న సదుద్దేశంతో ఈ నెల 10న నాగార్జునసాగర్ వద్ద ఉన్న విజయ విహార్ ఆవరణలో నిర్వహిస్తున్న వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యేందుకు అవకాశంఉన్నందున అధికారులందరూ జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని చెప్పారు.స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్ఓ దశరథ,
డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
__________
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
RELATED ARTICLES

