గ్రామ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్
ప్రజాసంక్షేమం న్యూస్ – నకిరేకల్, సెప్టెంబర్ 24:
నకిరేకల్ నియోజకవర్గంలోని ఉరుమడ్ల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు గ్రామానికి చెందిన నాయకులు గురువారం ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశంకు అందించి, శాలువాతో సత్కరించారు.అనంతరం ఉరుమడ్ల గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యేతో చర్చించారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.వారి విజ్ఞప్తిపై ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ,గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు,గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు,జన్నపాల శ్రీను,పల్లపు రామకృష్ణ,మేడబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఉరుమడ్ల నాయకులు!
RELATED ARTICLES

