ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.దానం నాగేందర్‌పై అనర్హత వేటు విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పును బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్వాగతించారు.దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. రానున్న ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో మళ్లీ సత్తా చాటుతామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, నియోజకవర్గాన్ని మరోసారి తమ ఖాతాలో వేసుకుంటామని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది

