Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeఅంతర్జాతీయంచిట్యాలలో నూతన పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం

చిట్యాలలో నూతన పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

పాడి రైతులకు రూ.20 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం
ప్రజా సంక్షేమం న్యూస్: (చిట్యాల )
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన (5,000 లీటర్ల సామర్థ్యం కలిగిన) పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు గురువారం వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులైన పాడి రైతులకు రూ.20 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే గారు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, పాడి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చిట్యాల పరిసర ప్రాంతాలలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ శీతలీకరణ కేంద్రం ద్వారా పాల నిల్వ సామర్థ్యం పెరిగి, పాడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుందని, ఇది స్థానిక రైతు కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయ డైయిరీ (తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య) చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నర్రా వినోద్-మోహన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పందిరి గీత-రమేష్ గారు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు స్థానిక పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.