Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణప్రజా వికాస సభను విజయవంతం చేయండి!డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత!

ప్రజా వికాస సభను విజయవంతం చేయండి!డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత!

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా.ఈ నెల 5 న నకిరేకల్ లో జరిగే ప్రజావికాససభను విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత పిలుపునిచ్చారు.గురువారం నాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమన్నారు.పేదలకు సన్న బియ్యం,5లక్షల ఇందిరమ్మ ఇండ్లు,200 ఉచిత విద్యుత్,RTC లో మహిళలకు ఉచిత ప్రయాణం,ఇందిరమ్మ చీరలు,ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు,క్వింటా సన్న వడ్లకు 500 రూపాయలు,రైతు రుణమాఫీ 21 వేల కోట్లు,రైతు భరోసా,నూతనంగా 16లక్షల రేషన్కా ర్డులు,2.50 లక్షల నూతన పెన్షన్ లాంటి పథకాలలో సకల జనాలకు ప్రయోజనం చేకూరిందని సంతోషం వ్యక్తం చేశారు.తెలంగాణను దోచుకున్న దోపిడిదారుల వారసులైన హరీష్ రావు కేటీఆర్ బిఆర్ఎస్ దొంగల ముఠా నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దవా చేశారు.2029 లో మళ్లీ సీఎం గా రేవంత్ రెడ్డి కానున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్,నకిరేకల్ pacs చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు,నకిరేకల్ మండల పార్టీ అధ్యక్షులు గాదగొని కొండయ్య,నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు లింగాల వెంకన్న,నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పన్నల రాఘవరెడ్డి,యాస కరుణాకర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి భవ్య తేజ్ రెడ్డి,నకిరేకల్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వలిశెట్టి స్వప్న,కౌన్సిలర్లు గాజుల సుకన్య, కందాల బిక్షం రెడ్డి,బానోత్ వెంకన్న,పోతుల రవి,చెవుగొని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.