Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనిరుద్యోగుల సమస్యలను కౌన్సిల్ లో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్.

నిరుద్యోగుల సమస్యలను కౌన్సిల్ లో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్.

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
శాసనమండలిలో నిరుద్యోగుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.టీజీపీఎస్సీ పోటీ పరీక్షల సిలబస్, కమిటీ నివేదికపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.అభ్యర్థులు ఏ సిలబస్ ను చదవాలో అనే అయోమయంలో ఉన్నారని,ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు.టీజీపీఎస్సీ నుంచి డిగ్రీ అర్హతతో ఉన్న ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.అలాగే గ్రూప్ 4,గ్రూప్ 3 విలీనంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అడిగారు.పాలిటెక్నిక్ విద్యపై ప్రచారంలో ఉన్నా అపోహలపై అవసరమైతే స్వల్పకాలిక చర్చకు ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే పోలీసు రిక్రూట్మెంట్ లో సమస్యలను పై కూడా ప్రత్యేకముగా మాట్లాడారు.Constable (CIVIL) నోటిఫికేషన్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో విధంగా 75% సివిల్ కానిస్టేబుల్ పోస్టులు. స్థానిక ఆదివాసులకు కేటాయించాలని ప్రభుత్వాని కోరారు అలాగే లాంగ్ జంప్ లో సడలింపులు,ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈవెంట్స్ లో లాంగ్ జంప్ అర్హత,ఏపీ, తమిళనాడు,కేరళ,కర్ణాటక లో ఉన్న విధంగా.మన రాష్ట్రంలోనూ పురుషుల అభ్యర్థులకు 4 మీటర్ల నుంచి, 3.8 మీటర్ల వరకు,మహిళా అభ్యర్థులకు 2.5 నుంచి, 2.3కి తగ్గించాలని కోరారు.పోలీసు నియామకాల్లో వయో పరిమితి పెంపు పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.