ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్
అన్నప్రసాద వితరణను ప్రారంభించిన ఎమ్మెల్యే
భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
ప్రజాసంక్షేమం న్యూస్ | నకిరేకల్:శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

