సభా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్‌లు
సిరిసిల్ల, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):
సిరిసిల్లలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, ఆది శ్రీనివాస్, చింతకుంట విజయ రమణారావు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సభా వేదిక నిర్మాణం, ప్రజలు కూర్చునే ప్రదేశం, పార్కింగ్, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి, సభకు వచ్చే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సిరిసిల్లలో భారీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు
RELATED ARTICLES

