Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసీతారాం ఏచూరి గారి ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి:వేముల బిక్షం సిపిఎం పార్టీ ...

సీతారాం ఏచూరి గారి ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి:వేముల బిక్షం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
సిపిఎం పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి రెండవ వర్ధంతి ఆత్మకూరు మండలం పరిధిలో కూరెళ్ల గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించినారూ ఈ సందర్భంగా వేముల బిక్షం మాట్లాడుతూభారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు చెల్లాచెదురుగా ఉన్న బిజెపి యేతర పార్టీలన్నింటినీ ఐక్యం చేయడంలో ఇండియా కూటమికి శ్రీకారం చుట్టడంలో కీలకపాత్ర పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప రాజకీయ ఆర్థికవేత్త ,మార్క్సిస్టు, లెనినిస్ట్, ఒక సిద్ధాంత వేత్త సీతారాం ఏచూరిని కోల్పోవడం భారత రాజకీయాలకు తీరని నష్టం. గత 12 సంవత్సరాలుగా దేశాన్ని,దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మతోన్మాద ఎజెండాకు ఎదురు నిలిచి పోరాడుతూనే దేశంలో కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేసే కృషిచేసిన కమ్యూనిస్టు మేధావి సీతారాం ఏచూరి.
1970 దశకంలో విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించి.క్రమక్రమంగా విద్యార్థి యువజన సంఘాలకు జాతీయస్థాయిలో నాయకత్వం వహించి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని అతి చిన్న వయస్సులో 1983లో ఎదురెళ్లి వారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన దిశాలి.సిపిఎం కేంద్ర కమిటీ లోకి చిన్న వయస్సులో ఎదిగిన వారి పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తి.సనాతన ధర్మాన్ని ఆచార సాంప్రదాయాలను పాటించే నేపథ్యం గల బ్రాహ్మణీయ కుటుంబం నుండి వచ్చిన వాటిని పటాపంచలు చేసి పేదలు వ్యవసాయ కార్మికులు కష్టజీవులు కార్మికుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి 50 ఏళ్ల పాటు వెనుదిరగకుండా దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన వారి జీవితం నేటి యువతకు ఒక గొప్ప ఆదర్శం. తెలుగు,ఇంగ్లీషు,మలయాళం,బెంగాలీ లాంటి ఉర్దూ భాషల్లో తనకున్న ప్రావీణ్యం వారిని ప్రపంచ రాజకీయాల్లో కీలక నేతగా మార్చింది. నేపాల్ మావోయిస్టు పార్టీ ఆయుధాలను వదిలి పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రవేశించే విషయంలో వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగిందనేది ప్రపంచానికి తెలిసిన ఒక బహిరంగ వాస్తవం.*
భారత పార్లమెంట్లో రాజ్యసభకు రెండు పర్యాయాలు ఎన్నికైన వారు పోషించిన పాత్ర వారికి గొప్ప పార్లమెంటరీ నాయకుడిగా అవార్డులు ఇచ్చిన సందర్భంలో విపక్ష పార్టీల నేతలు వారి కోసం మాట్లాడిన మాటలు వారి దార్శనికతను పోరాటపటిమను గుర్తు చేస్తున్నాయి ఉత్తమ పార్లమెం టేరియ ఎన్ గా రాజకీయవేతగా కాకుండా పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగాడుతూ అనేక పుస్తకాలు రచించిన ఒక గొప్ప నాయకుడు కమ్యూనిస్టు ఉద్యమాలకు ఎవరు తీర్చలేని నష్టం వారి ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే తరాలను తయారు చేయడమే వారికి ఇచ్చే ఘన నివాళులు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి వార్డ్ నెంబర్ తుమ్మలగూడెం యాదయ్య ఉప సర్పంచ్ హనుమంతుల రమేష్ వార్డ్ నెంబర్ కన్నబోయిన అంజయ్య సీనియర్ నాయకులు భాషా బోయిన రాములు మరి పెళ్లి మల్లయ్య మారుపాక సత్తయ్య భాష బోయిన ఐలయ్య బుగ్గయ్య కే మచ్చ గిరి ఎస్ ఆగయ్య ఎం వీరయ్య జి రవి బి రాకేష్ గణేష్ బి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.