Friday, October 16, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఎల్‌నినో ప్రభావంపై సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలి

ఎల్‌నినో ప్రభావంపై సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలి

📰 Generate e-Paper Clip

**తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రత్యేక అధికారి దాసరి హరిచందన**
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:
ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న నాలుగైదు నెలల పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నిరంతరంగా తాగునీరు అందించేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా, వ్యవసాయ రంగానికి ఇబ్బందులు కలగకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. రానున్న నెలల్లో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.