అక్టోబర్ 26న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలి
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ, అక్టోబర్ 24: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వల్లపుదాసు భూలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. ఈ నెల 26న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో యూనియన్ ఆధ్వర్యంలో పేషెంట్ కేర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం జీజీహెచ్ యూనిట్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా దండెంపల్లి సత్తయ్య, అధ్యక్షుడిగా మునగ వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా అవుట రవీందర్, కోశాధికారిగా కట్ట ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వలికి లలిత, నాగలక్ష్మి, పి. భాస్కర్, వర్కింగ్ సెక్రటరీగా బోడ జానకి ఎన్నికయ్యారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు లక్కపాక రాజు, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, గంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు విధానం రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలి
RELATED ARTICLES

