Friday, November 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణదేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

జాతీయ ఐక్యత దినోత్సవంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు
నల్లగొండ, అక్టోబర్ 31 (ప్రజా సంక్షేమం న్యూస్):

దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. భారత ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ యువకుడిగా ఉన్నప్పటి నుంచే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, మహాత్మా గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులతో కలిసి స్వాతంత్ర్య సాధనకు కృషి చేశారని, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.ముఖ్యంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ చూపిన చొరవను గుర్తుచేశారు. ఆయన సేవలకు గుర్తుగా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లాలో కేవాడియా వద్ద నర్మదా నది ఒడ్డున ప్రపంచ ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా నుంచి ఒక ప్రతినిధి బృందం కేవాడియాకు వెళ్లినట్లు వెల్లడించారు.దేశ ఐక్యతను, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసే విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వాటి ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.అనంతరం ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అధికారులు, సిబ్బంది, ఇతర ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.