‘పొంగులేటి శ్రీనన్న యువ నేస్తం’ ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
**హైదరాబాద్:** నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘పొంగులేటి శ్రీనన్న యువ నేస్తం’ పేరుతో ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు నిపుణుల ద్వారా ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడంతో పాటు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్:
RELATED ARTICLES

