కనగల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన శరత్ చంద్ర పవార్
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ, అక్టోబర్ 27:పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశించారు. మంగళవారం కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించి, కేసుల పురోగతి,రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు.నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా, రాత్రి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని, గంజాయి అక్రమ రవాణా, సైబర్ నేరాల నివారణపై దృష్టి సారించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ,మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,సీఐలు నాగరాజు, రాము, శ్రీను నాయక్, ఎస్‌ఐ రాజీవ్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి:ఎస్పీ
RELATED ARTICLES

