Wednesday, November 11, 2026
prajasamkshemam news
HomeUncategorizedపోలీస్ అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

రక్తదానం మహాదానం..ప్రాణదానంతో సమానం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ:
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానం మహాదానమని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన అమ్మ ఫౌండేషన్ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.