బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అక్టోబర్ 29, మునుగోడు, ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి:
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని పుల్లెంల గ్రామానికి చెందిన చెడు బుద్ధి ఉషయ్య కుమారుడు హరికృష్ణకు మెరుగైన వైద్యం అందించేందుకు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చొరవ తీసుకున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరికృష్ణ వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్సీ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు.ప్రభుత్వం నుంచి రూ.1,25,000 విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించి, గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం కొంత ఊరటనివ్వనుంది.ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గురజా రామచంద్రంతో పాటు పలువురు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం కోసం రూ.1.25 లక్షల ఎల్ఓసీ అందజేత
RELATED ARTICLES

