ఉరుమడ్ల, నవంబర్ 08 (ప్రజా సంక్షేమం న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉరుమడ్ల గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, జన్నపాల శ్రీను, పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీను, హరిప్రసాద్, రాము, పూలమ్మ, వెంకటేష్, కుమార్, శంకర్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఉరుమడ్లలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
RELATED ARTICLES

