Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుతుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు జరపాలి!

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు జరపాలి!

📰 Generate e-Paper Clip

ముంపు భూముల పరిహారానికి సిద్ధంగా ఉన్నాం.. అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో జమ చేస్తాం
హైదరాబాద్: ప్రజా సంక్షేమం న్యూస్:
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.జూబ్లీహిల్స్ నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చలు, ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, సంబంధిత పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని సీఎం సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో జమ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.భూముల ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సర్వేకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. మహారాష్ట్ర అధికారులకు అవసరమైన సమాచారం, పత్రాలను ఎప్పటికప్పుడు అందిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.