ఫర్టిలైజర్ షాపు అనుమతి కోసం లంచం డిమాండ్ – కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడి.
సదాశివపేట, నవంబర్ 4 (ప్రజా సంక్షేమం న్యూస్):
ఫర్టిలైజర్ (ఎరువుల) దుకాణం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి (MAO) ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.వివరాల్లోకి వెళితే.. సదాశివపేట మండల పరిధిలో ఫర్టిలైజర్ షాపు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం ఓ వ్యక్తి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనుమతి మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని సదరు అధికారి డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కార్యాలయంలో నిఘా ఏర్పాటు చేశారు. బాధితుడు అధికారికి లంచం నగదు అందజేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణైనట్లు సమాచారం.అనంతరం కార్యాలయంలోని సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహించారు. అధికారిపై కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనికైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మండల వ్యవసాయ అధికారి
RELATED ARTICLES

