Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeక్రైమ్సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు!

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు!

📰 Generate e-Paper Clip

నవంబర్ 15,ప్రజా సంక్షేమం న్యూస్|సూర్యాపేట జిల్లా:
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న భార్యాభర్తల్లో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది.ఈ ప్రమాదంలో హుజూర్‌నగర్‌కు చెందిన షేక్ నజీర్ మృతి చెందగా, ఆయన భార్య హుస్సేన్ బీ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతులిద్దరూ వంట మాస్టర్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. కల్లేపల్లి మైసమ్మ వద్ద వంట కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.