Thursday, November 12, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలు2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ – మంత్రి పొన్నం ప్రభాకర్

2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ – మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం
హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్:

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగాలకు సంబంధించి సచివాలయంలో నిర్వహించిన తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఆటోమొబైల్, ఈవీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆటోమొబైల్ తయారీ, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండేళ్ల క్రితమే ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. ఈవీ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు కల్పించామని వెల్లడించారు.ఈ ప్రోత్సాహకాల ఫలితంగా గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2,17,690 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయమయ్యాయని, సుమారు రూ.2,343 కోట్ల మేర పన్ను మినహాయింపులు కల్పించామని మంత్రి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు.ఆటోమొబైల్, మొబిలిటీ రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో మూడు పారిశ్రామిక పార్కులు, మొబిలిటీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌తో పాటు ఎంకతల, కొడంగల్ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు తమ పరిశ్రమలను మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.ఈ సమావేశంలో రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, కార్యదర్శి నిఖిల్ చక్రవర్తి, జేటీసీ వెంకట రమణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కన్వీనర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఔజాద్ షేక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.