Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనల్గొండ జిల్లాలో VB & GRAM G ఉద్యోగుల నాలుగో రోజు పెన్‌డౌన్ – షట్‌డౌన్...

నల్గొండ జిల్లాలో VB & GRAM G ఉద్యోగుల నాలుగో రోజు పెన్‌డౌన్ – షట్‌డౌన్ ఆందోళన

📰 Generate e-Paper Clip

నల్గొండ , ఆగస్టు 4:
VB & GRAM G ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో VB & GRAM G ఉద్యోగులు నాలుగో రోజు పెన్‌డౌన్ – షట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నాంపల్లి మండలంలో జేఏసీ రాష్ట్ర నాయకులు గుంటక వెంకటేశం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని జీవితాలతో సతమతమవుతున్నాము ఉద్యోగ భద్రత లేక పదోన్నతులు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా యొక్క వేతనాలు పెరగాలని అందుకు తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చండూరు మండలంలో ఏపీఓల సంఘం జిల్లా అధ్యక్షులు నిదుర శ్రీనివాస్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మా కష్టార్జితం కనబడడం లేదా కూలీలకు పనులు కల్పించడం కాకుండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన పనులు సిసి రోడ్లు గ్రామ పంచాయతీ బిల్డింగులు,వ్యక్తిగత మరుగు దొడ్లు, అంగన్వాడీ బిల్లింగులు,vo బిల్లింగులు పండ్ల తోటలు భూ అభివృద్ధి పనులు కల్పిస్తూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అయినము కాబట్టి తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే తమ హక్కుల కోసం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున షట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తక్షణమే తక్షణమే తమ యొక్క న్యాయమైన అభిమానులు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు

✅ VB & GRAM G ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.
✅ పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
✅ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని హామీలను అమలు చేయాలి.
✅ ఉద్యోగ భద్రతతో పాటు సముచిత వేతనాలు, సర్వీస్ బెనిఫిట్లు కల్పించాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.