Sunday, August 23, 2026
prajasamkshemam news
HomeUncategorizedగ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం

గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

నకిరేకల్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ సందర్భంగా మండలంలోని గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు తదితర ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన పాలన, సేవలు అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశంసూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.