Sunday, August 23, 2026
prajasamkshemam news
HomeUncategorizedవరంగల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు దొంగల అరెస్ట్

వరంగల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు దొంగల అరెస్ట్

📰 Generate e-Paper Clip

నిన్నటి రోజు 11-08-2026 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వరంగల్ GRP CI గారు శ్రీ V. నరేష్ కుమార్ గారు వరంగల్ GRP HC S.రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ రాము, RPF-CIB HC N.రమేష్ మరియు RPF వరంగల్ ASI P. దుర్గాప్రసాద్,HC S. శ్రీనివాస్ తో కలిసి వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 2 & 3 న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమీపాన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మగ వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా అట్టి వారిని విచారించగా తమ పేర్లు 1) మాదిగ అరవింద్ S/o సుంకయ్య, 19 సంవత్సరాలు,SC మాదిగ, లేబర్ వర్క్,R/O పాతపేట, డోన్ మండలం, కర్నూలు జిల్లా.2) కోట జంపయ్య S/o ఎల్లయ్య,26 సంవత్సరాలు, ముదిరాజ్, ఆటో డ్రైవర్,R/O శ్రీనగర్ కాలనీ,పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇద్దరు కలిసి తేదీ 09-08-2026 రోజు రాత్రి నవజీవన్ ఎక్స్ప్రెస్ నందు దొంగిలించిన గూగుల్ పిక్సెల్ -9 మొబైల్ ఫోన్ 1,20,000/-తో పాటు వేరే ట్రైన్లలో దొంగిలించిన ఇంకా రెండు మొబైల్ ఫోన్లు ఉండగా మొబైల్ ఫోన్లు మొత్తం విలువ 1,50,000/-( అక్షరాల ఒక లక్ష యాబై వేల రూపాయలు) పంచుల సమక్షంలో ఒప్పుకోలు మరియు స్వాధీన పంచనామా ద్వారా మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులని రిమాండ్ నిమిత్తం కాజీపేట రైల్వే కోర్టు నందు హాజరుపరచగా రైల్వే మెజిస్ట్రేట్ గారు ఖమ్మం డిస్టిక్ జైలుకు పంపడమైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.