ప్రజా సంక్షేమం న్యూస్-హాలియా
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హాలియా పురపాలక సంఘంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పి. రవికుమార్, పర్యావరణ ఇంజనీర్ మరియు ఎం.డి. ఖలీల్, సానిటరీ ఇన్స్పెక్టర్ (ఇన్చార్జ్) లను హాలియా మున్సిపాలిటీలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసి ప్రశంస పత్రాలను అందజేశారు.నల్గొండ జిల్లా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి ప్రశంస పత్రాలు అందజేశారు.
మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం మరియు స్వచ్ఛత కార్యక్రమాల అమలులో వారు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవం అందించినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంస పత్రాలు అందుకున్న పి. రవికుమార్, ఎం.డి. ఖలీల్లను మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. ఉద్యోగుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత అంకితభావంతో ప్రజలకు సేవలందించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వారు పేర్కొన్నారు.

