ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
ప్రజా సంక్షేమం న్యూస్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ/తహశీల్దార్) దేశాని శ్రీనివాసరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఆగస్టు 20,2026న ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు.
సోదాల వివరాలుఅధికారిక ఆస్తుల విలువ రూ.6.87 కోట్ల పైచిలుకు విలువైన స్థిరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.భూములు,నివాసాలు:రెండు ఫ్లాట్లు,ఒకపెెంట్‌హౌస్,10 ఎకరాల వ్యవసాయ భూమి, 8 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలు లభించాయి.ఇతర పెట్టుబడులు,నగదు: బాలాపూర్‌లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల పెట్టుబడి,రూ.4లక్షల నగదు,680 గ్రాముల బంగారం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.గతంలో మహేశ్వరం,బాలాపూర్, షాద్‌నగర్/షంషాబాద్ ప్రాంతాలలో తహశీల్దార్‌గా పనిచేశారు. 2009లోనూ ఆయనపై ఏసీబీ కేసు నమోదైంది.

