Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణపాలిటెక్నిక్‌ల బలోపేతానికే పునర్వ్యవస్థీకరణ:మంత్రి వివేక్ వెంకటస్వామి

పాలిటెక్నిక్‌ల బలోపేతానికే పునర్వ్యవస్థీకరణ:మంత్రి వివేక్ వెంకటస్వామి

📰 Generate e-Paper Clip

విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ:
పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకురావడంపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టత:
పరిశ్రమలతో అనుసంధానం..ఉపాధి అవకాశాల విస్తరణే లక్ష్యం:

ప్రజా సంక్షేమం న్యూస్
పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.సచివాలయంలో గురువారం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్‌లను కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (CTE) పరిధి నుంచి కమిషనరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (CET) పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జూన్ 16, 2026న జీఓ 97 జారీ చేసిందని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడానికి, దాని గుర్తింపును మార్చడానికి కాదని.. కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.