ప్రజాసంక్షేమం న్యూస్ -నకిరేకల్
ఈ నెల 5న (శనివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో మినీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం గారు.కలెక్టర్ చంద్రశేఖర్ గారు,ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారు వివిధ శాఖల అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని,గత విధ్వంస పాలన నుంచి వికాసం వైపు రాష్ట్రం సాగుతోందని అన్నారు.సీఎం పర్యటనలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉంటాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని,డబుల్ బెడ్రూం,ఇంటికో ఉద్యోగం,మూడెకరాల భూమి వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడలేదని, వారు సభకు రానందున దళిత నేతకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని అన్నారు.సీఎం సభను ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

