Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకామ్రేడ్ గాదెగాని మల్లయ్య గారి 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

కామ్రేడ్ గాదెగాని మల్లయ్య గారి 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్:మోటకొండూరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ గాదెగాని మల్లయ్య గారి 21వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ నల్ల ప్రదీప్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం తదితరులు మల్లయ్య గారి స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ.ఉమ్మడి మోటకొండూరు గ్రామ పంచాయతీలో రెడ్డిగట్టి శేషయ్య నాయకత్వంలో రేగు సిద్దయ్య, గాదెగాని మల్లయ్య, కొల్లూరు ఇస్తారిలతో కలిసి మోటకొండూరులోని 950 సర్వే నంబరు భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో మల్లయ్య గారు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ… గాదెగాని మల్లయ్య గారు ఉమ్మడి యాదగిరిగుట్ట మండల కౌన్సిల్‌గా పనిచేస్తూ మోటకొండూరు గ్రామంలో నిరుపేదల పక్షాన నిలబడి పోరాటాలు చేశారని తెలిపారు. భూమి లేని పేదలకు సాగుభూమి కల్పించేందుకు భూపోరాటాల్లో ముందుపీఠిన నిలిచారని, అలాగే ఆరెగూడెం గ్రామంలో పెత్తందారుల ఆక్రమణలో ఉన్న గుడి, బడి స్థలాలను ప్రజా పోరాటాల ద్వారా కాపాడిన ఘనత మల్లయ్య గారిదేనని పేర్కొన్నారు. మల్లయ్య గారి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు, మండల కార్యవర్గ సభ్యులు బోల శ్రీనివాసు, పశువుల నరసింహ, మారబోయిన నరేష్, గాదెగాని మల్లేష్, మారబోయిన హేమలేష్, మారబోయిన జహంగీర్, రేగు యాదయ్య, కొండ భీమయ్య, బిస పాండు, పేరబోయిన రమేష్, గాదేగాని నరసింహులు, నల్ల యుద్ధవరెడ్డి, జివిలికపల్లి పాండు, గాదేగాని కరుణాకర్, బీరకాయల మధు, బీసా నరసయ్య, గాదేగాని కార్తీక్, గాదెగాని రాజు, కొల్లూరు స్వామి తదితర సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.