Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనకిరేకల్ సీఎం సభను విజయవంతం చేయండి:

నకిరేకల్ సీఎం సభను విజయవంతం చేయండి:

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్ (చిట్యాల) :
ఈ నెల 5వ తేదీన నకిరేకల్‌లో నిర్వహించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్,నకిరేకల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వేముల వీరేశం గారి ఆదేశాల మేరకు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో విస్తృత స్థాయి జన సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు, కార్యకర్తలతో సమావేశమై సీఎం బహిరంగ సభకు తరలివచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. నకిరేకల్ నియోజకవర్గంలో జరగబోయే ఈ భారీ సభకు వార్డు నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ, 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, జిల్లా నాయకులు పాటి నరసింహారెడ్డి, జిల్లా SC సెల్ అధ్యక్షులు బోడ స్వామి, మాజీ MPTC గంటెపాక స్వామి, సీనియర్ నాయకులు పోకల అశోక్, జిట్టా స్వామి, జనగాం రాములు, గంగారపు గణేష్, జిట్టా భిక్షం, చిత్రగంటి నాగరాజు, పిల్లి నాగేష్, చిత్రగంటి శీను, జనగామ అర్జున్, కుక్కల వీరేష్, ఓంకార్, హర్షిత్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.