కురుమూర్తి స్వామి ఆలయానికి మెరుగైన అనుసంధానం.. ప్రయాణ సమయం తగ్గింపు!
మహబూబ్నగర్ జిల్లా: దేవరకద్ర నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రూ.134.98 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు కీలక HAM రహదారి పనులకు శంకుస్థాపన జరిగింది.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మంత్రి శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి స్థానిక ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రధానంగా చేపట్టనున్న పనులు:
కురుమూర్తి స్వామి ఆలయ అనుసంధానంతో వర్నే వరకు డబుల్ రోడ్డు — రూ.103.54 కోట్లు
NH-44 నుంచి పొన్నకల్, డోకూర్ మీదుగా దేవరకద్ర వరకు రహదారి మరమ్మతులు — రూ.13.43 కోట్లు
భూత్పూర్ చౌరస్తా నుంచి భట్టుపల్లి తండా మీదుగా కర్వేన వరకు రహదారి విస్తరణ — రూ.18.01 కోట్లు
ఈ రహదారులు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.అలాగే స్థానికంగా వ్యాపార, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఈ రహదారి ప్రాజెక్టులు దోహదపడనున్నాయి.
దేవరకద్రలో రూ.134.98 కోట్లతో మూడు కీలక రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి:
RELATED ARTICLES

