Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరామన్నపేట–పల్లెపహాడ్ రహదారి దుస్థితిపై సీపీఎం వినూత్న నిరసన

రామన్నపేట–పల్లెపహాడ్ రహదారి దుస్థితిపై సీపీఎం వినూత్న నిరసన

📰 Generate e-Paper Clip

గుంతల్లో నిలిచిన నీటిలో కూర్చొని నిరసన.. సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడి:సీపీఎం నాయకులు
ప్రజాసంక్షేమం న్యూస్-రామన్నపేట:
రామన్నపేట నుంచి పల్లెపహాడ్ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమై, అడుగడుగునా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక గ్రామంలో ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించారు.రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో దుబ్బాక, మునిపంపుల గ్రామాల సర్పంచులు గట్టు నర్సింహా, బొడ్డుపల్లి వెంకటేశం గుంతల్లో నిలిచిన నీటిలో కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రజల ప్రయాణాలు నరకప్రాయంగా మారినా కనీసం తట్టెడు మట్టి పోసే స్థితిలో కూడా ఆర్‌అండ్‌బీ అధికారులు లేకపోవడం విచారకరమన్నారు. ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
“ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలపై చోద్యం చూడటం సిగ్గుచేటు” అని జల్లెల పెంటయ్య అన్నారు.రామన్నపేట–పల్లెపహాడ్ రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని మునిపంపుల, దుబ్బాక సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం,గట్టు నర్సింహా హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.