అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
ప్రజాసంక్షేమం న్యూస్-చిట్యాల: శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ బస్టాండ్ సమీపంలో VV టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
చిట్యాలలో వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం
RELATED ARTICLES

