2027 జనాభా లెక్కల్లో ఓబీసీ కాలమ్ చేర్చి కులగణన చేపట్టాలి!
బీసీల జనాభాకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలి!
50 శాతం రిజర్వేషన్ పరిమితిపై కేంద్రం పునరాలోచించాలి!
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాతీయ ఓబీసీ సదస్సులో డిమాండ్ చేశారు.బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించినప్పుడే జనాభా ప్రాతిపదికన వారికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో “ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు–ఓబీసీల తక్షణ బాధ్యతలు,భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై జాతీయ ఓబీసీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు,ప్రతినిధులు,వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లోని ఓబీసీ ఫోరం ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రస్తుతం తెలంగాణలో బీసీల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులను కూడా కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.తెలంగాణలో కులగణన ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.బీసీల సమస్యలపై దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు,మేధావులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న జాజుల శ్రీనివాస్, ఆయన సహచరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు
బీసీల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరం:పొన్నం ప్రభాకర్
RELATED ARTICLES

