నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా,వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:
ప్రజాసంక్షేమం న్యూస్:చిన్నకొండూరు/యాదాద్రి భువనగిరి:
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధికారులను ఆదేశించారు.చిన్నకొండూరు గ్రామంలోని బొమ్మల చెరువు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన స్థలాన్ని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్,చౌటుప్పల్ డీఎస్పీ పి.మధుసూదన్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువు వద్ద బారికేడ్లు,లైటింగ్,మౌలిక సదుపాయాలు,రోడ్ల మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు,సిబ్బంది,ప్రజాప్రతినిధులు,గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
బొమ్మల చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ!
RELATED ARTICLES

