Wednesday, October 14, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు పునరంకితం కావాలి: 'చరణ్య శ్రీ ఫౌండేషన్' అధినేత దోమలపల్లి...

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు పునరంకితం కావాలి: ‘చరణ్య శ్రీ ఫౌండేషన్’ అధినేత దోమలపల్లి గోపి

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన నాయకుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
సమాజంలోని పేద, అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, బహుజన రత్న శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని ‘చరణ్య శ్రీ ఫౌండేషన్’ ఫౌండర్ దోమలపల్లి గోపి కొనియాడారు.
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని, చరణ్య శ్రీ ఫౌండేషన్ (CHARANYA SRI FOUNDATION) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి దోమలపల్లి గోపి పూలమాల వేసి, పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా దోమలపల్లి గోపి మాట్లాడుతూ —”సామాన్యుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితం, స్ఫూర్తి ఎల్లప్పుడూ సమాజానికి మార్గదర్శకం. బాపూజీ చూపిన సేవా మార్గంలో పయనిస్తూ, సమాజ శ్రేయస్సు, చైతన్యం మరియు సామాజిక సాధికారత (Service, Awareness, Empowerment) లక్ష్యాలుగా చరణ్య శ్రీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు, బాధితులకు సేవలందిస్తాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకుర్పించే నిజమైన నివాళి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.