Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుబీసీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరాలి:బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరాలి:బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

గురుకులాలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి!
‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ దరఖాస్తులపై సమీక్ష!
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్
:
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ,విద్యా కార్యక్రమాలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం దరఖాస్తుల స్వీకరణ, అమలు తీరుతో పాటు బీసీ గురుకులాలు,హాస్టళ్ల పనితీరు,విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’పథకం కింద ఇప్పటివరకు 4.06 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరించారు.దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి బీసీ మహిళకు పథకం ప్రయోజనం అందేలా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గురుకులాల్లో నాణ్యమైన విద్య,పౌష్టికాహారం:
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, బీసీ హాస్టళ్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. గురుకులాలు,హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు,మౌలిక వసతులు,క్రీడలు, సిబ్బంది నియామకాలు,డిజిటల్ విద్య,ఉన్నత విద్య,ఉద్యోగ,ఉపాధి అవకాశాలపై చర్చించారు.
బీసీల ఆర్థికాభివృద్ధికి చర్యలుబీసీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను అభివృద్ధి చేసుకునేలా మరిన్ని అవకాశాలు కల్పించాలని అధికారులను సూచించారు.
గురుకులాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి:
రాష్ట్రంలో మొత్తం 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా,ప్రస్తుతం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. మిగిలిన గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయా జిల్లాల్లో సొంత భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సేకరించాలని ఆదేశించారు.ఇప్పటికే స్థలం అందుబాటులో ఉన్న గురుకుల పాఠశాలలకు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.గురుకులాలు,హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఆరోగ్యకరమైన,ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.